ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్… వస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. టిక్ టాక్ పైన నిషేధం ఇంకా కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దానిని అన్‌బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం.

టిక్ టాక్ పై నిషేధం ఎత్తి వేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకూడదని… వెల్లడించింది కేంద్ర సర్కార్. ట్రంప్ వేస్తున్న సుంకాల కారణంగా… చైనాకు దగ్గరవుతోంది ఇండియా. ఇండియా అలాగే చైనా మధ్య సంబంధాలు ఈ మధ్యకాలంలో మెరుగు పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే చైనా యాప్‌లకు మోడీ ప్రభుత్వం… డోర్లు తెరిచే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.