హైదరాబాద్ మహానగరంలో… కరెంట్ షాక్ తగిలి చాలామంది యువకులు మరణిస్తున్నారు. గణపతి పండుగ వచ్చిన నేపథ్యంలో చాలామంది ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటివరకు హైదరాబాదులో కరెంట్ షాక్ తగిలి ఏకంగా 10 మంది మరణించారు. ఆరు రోజుల వ్యవధిలోనే పదిమంది మృతి చెందడం గమనార్హం. లేటెస్ట్ గా హైదరాబాదులో మరో వ్యక్తి కరెంటు షాక్ తో దుర్మరణం చెందాడు.

లోతుకుంటలో ఇంట్లో శుభకార్యం పందిరి వేస్తుండగా కరెంటు వైర్ ఐరన్ రాడ్ కు తగిలి కరెంట్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏకంగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. అయితే సి సి టీవీ ఫుటేజ్ ను తాజాగా విడుదల చేశారు పోలీసులు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచనలు చేస్తున్నారు.