కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

-

కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు దహనం చేసారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసారు. హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు. కల్వకుంట్ల కవిత… బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shraddha Das
Shraddha Das

పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. అటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది. హరీష్ రావు, సంతోష్ పై కవిత చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్… బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి నుంచి వార్తలు రాగా….కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసినట్లు లేఖ కూడా రిలీజ్ చేసాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news