నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి vs బీజేపీ నాయకుడు వర్షిత్ రెడ్డి

-

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి vs బీజేపీ నాయకుడు వర్షిత్ రెడ్డి అన్న‌ట్లుగా వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. నల్గొండ పట్టణ కేంద్రంలోని వినాయకుడి విగ్రహం వద్ద రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగం చేస్తుండగా, నల్గొండ బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

komatireddy
Minister Komatireddy vs BJP leader Varshit Reddy in Nalgonda

ఈ సమావేశంలో రెండు వర్గాల మధ్య పదేపదే తోపులాట ఎదురైంది. సంఘటన తీవ్రతకు చేరడంతో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రత్యక్షదర్శుల ప్రకారం, సంఘటనలో ఎలాంటి గాయాల సమాచారం అందలేదు, కానీ స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ ఘటనను ప్రధానంగా చర్చించబడుతోంది. వినాయకుడి విగ్రహం వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుండగా అడ్డుకొని నిరసన తెలిపిన నల్గొండ బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news