సాధారణంగా మనం ముందుకు నడుస్తాం, పరిగెడతాం కానీ వెనక్కి నడవడం (రివర్స్ వాకింగ్) వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇది కేవలం వినోదం కోసం చేసే పని కాదు, మన శరీరంపై చూపించే సానుకూల ప్రభావాలు చాలా ఎక్కువ. జాగింగ్, ఫార్వర్డ్ వాకింగ్‌తో పోలిస్తే, రివర్స్ వాకింగ్ మన కండరాలకు మరింత మెరుగైన వ్యాయామాన్ని ఇస్తుంది. సాధారణంగా ఉపయోగించని కండరాలను ఇది చురుగ్గా మారుస్తుంది. మరి దీని ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం..
రివర్స్ వాకింగ్ ప్రయోజనాలు: ముఖ్యంగా మోకాలి కీళ్ల నొప్పులు ఉన్నవారికి రివర్స్ వాకింగ్ చాలా మంచిది. ఇది మోకాలి పై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బలపరుస్తుంది. ఈ వ్యాయామం వల్ల మోకాళ్ళకు గాయాలు అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
మెరుగైన సమన్వయం ఏకాగ్రత: వెనక్కి నడవడం వల్ల మన మెదడు శరీరం మధ్య సమన్వయం పెరుగుతుంది. ఏకాగ్రతను పెంచుకోవడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది సాధారణ నడక కంటే ఇది మెదడుకు ఎక్కువ పని కల్పిస్తుంది.
కండరాల బలం పెరుగుదల: రివర్స్ వాకింగ్ వల్ల ముందు వైపు కండరాలు బలపడడంతో పాటు తొడ వెనుక భాగంలో కండరాలు పిక్కల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. ఇది శరీరానికి పూర్తిస్థాయి వ్యాయామాన్ని అందిస్తుంది.
ఎక్కువ క్యాలరీలు ఖర్చు: వెనక్కి నడవడం కోసం శరీరం మరింత ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల ముందుకు నడిచినప్పుడు కంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి మార్గం. వెనక్కి నడవడం వల్ల శరీర బ్యాలెన్స్ మెరుగుపడతాయి. ఇది మన వెన్నుపూసకు కూడా మంచి వ్యాయామాన్ని అందిస్తుంది.
రివర్స్ వాకింగ్ అనేది కేవలం సరదాగా చేసే పని కాదు, ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. కీళ్ల ఆరోగ్య మెరుగుపడడం, కండరాలు బలపడడం, బరువు తగ్గడం, మెదడు చురుగ్గా పనిచేయడం వంటి ఎన్నో లాభాలు దీని ద్వారా పొందవచ్చు.