తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలో అక్కడకక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.