కరోనా వైరస్ ను గొడుగు అడ్డుకుంటుందా…?

-

ఏంటి కరోనా వైరస్ ని గొడుగు అడ్డుకుంటుందా…? ఆలోచన సరిగా ఉంటే అడ్డుకుంటుంది. ప్రతీ దానికి నవ్వకుండా ఉంటే గొడుగు వలన ప్రయోజనం ఎంత ఉంటుందో మనకు అర్ధమవుతుంది. కరోనా వైరస్ రాకుండా ఉండాలి అంటే ఎం చెయ్యాలి. ఇంట్లో ఉండాలి, సామాజిక దూరం పాటించాలి. సామాజిక దూరం పాటించాలి అంటే మనకు సాధ్యమా… ఎవరో ఒకరు వచ్చి మీద పడతాడు. అరికాలికి లేని మట్టిని నెత్తిన పెట్టుకున్నట్టు ఉంటుంది.

కాబట్టి మనకు గొడుగు ఉంటే సామాజిక దూరం పాటించడం అనేది చాలా సులువు అంటున్నారు. మనిషికి మనిషికి మూడు అడుగుల దూరం ఉండాలి. మూడు అడుగులు దూరం పాటించడానికి గొడుగు ఉపయోగపడుతుంది. ఎదుటి వారు మన మీదకు రాకుండా గొడుగు అడ్డం పెట్టుకునే సదుపాయం ఉంటుంది. ఎవరైనా తుమ్మినా దగ్గినా సరే గోడుగుని అడ్డం పెట్టుకునే అవకాశం ఉంటుంది.

ఎవరికి వాళ్లు గొడుగులు వాడితే… అందరూ సామాజిక దూరం పాటించేందుకు చక్కగా వీలవుతుంది అని విశాఖకు చెందిన ఒక వైద్యుడు సలహా ఇచ్చారు. మరి గోడుగుపై వైరస్ ఉంటుంది కదా…? దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత సబ్బుతో లేదా శానిటైజర్ తో కడిగి కాసేపు ఎండలో పెడితే ఆరిపోతుంది. మనం ఎండలో ఉన్న సమయంలో గొడుగు వాడకుండా శరీరానికి గొడుగు తగిలే విధంగా చూసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news