నిజామాబాద్ పరిధి బోధన్ లో ఉగ్ర మూకల కలకలం చోటు చేసుకుంది. ఐసిస్ కార్యకలాపాలకు సంబంధం అన్నట్లు డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే…. బీ-ఫార్మసీ చదువుతున్న మహమ్మద్ యూసైఫా యమన్ అనే యువకుడి అరెస్ట్ అయ్యాడు. నాలుగు గంటల పాటు ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ చేశారు.

బోధన్ కోర్టులో ప్రవేశ పెట్టీ కస్టడీలోకి తీసుకునీ వెంట తీసుకెళ్లారు డిల్లీ పోలీసులు. కొంతకాలంగా ఉగ్రవాదుల యాప్ లో యువకుడు యాక్టివ్ అయ్యాడు. ఆయుధాలు, మందు గుండ్లు సామాగ్రి తయారీ వంటి పనుల్లో చురుకైన పాత్ర పోషించాడని అంటున్నారు అధికారులు. సదరు యువకుడి వద్ద ఎయిర్ పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో రాంచి పట్టణం బాంబు దాడుల కుట్రల ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారం పై ఢి ల్లీ పోలీసులు బోధన్ లో తనిఖీలు చేస్తున్నారు.