ఈఏంఐలు ద్వారా మొబైల్ కొనేవారికి బిగ్ షాక్. ఫోన్ ఈఏంఐలు కట్టకుంటే ఫోన్‌ను లాక్ చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలకు అనుమతినిచ్చే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు చెబుతున్నారు. దేశంలో చాలా మంది ఫోన్‌ను లోన్‌లో తీసుకొని, ఈఏంఐలు కట్టకుండా ఎగగొడుతున్నారని.. ఫోన్ లాక్ వల్ల ఇలాంటి సమస్యలు రావని అమలు చేసే యోచనలో ఆర్బీఐ ఉందని అంటున్నారు.

ఫోన్ కొనే సమయంలోనే ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారట ఫైనాన్స్ కంపెనీలు. ప్రజల హక్కులకు భంగం కలగకుండా.. ఫోన్ కొనే వారి నుండి ముందస్తు అనుమతి తీసుకొని, వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా ఆర్బీఐ నిబంధనలను తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.