తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెను ప్రమాదం తప్పింది. పొన్నం ప్రభాకర్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న టైంలో.. డివైడర్ని ఢీకొట్టింది తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్కార్ట్ వాహనం.

టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే… ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వేరే కారులో ఉన్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.