గత కొద్ది రోజుల నుంచి ఏపీలో టమాట, ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఓవైపు ఉల్లి ధరలు రైతులను అయోమయానికి గురి చేస్తుంటే ఇప్పుడు టమాటాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్ లో ఈరోజు టమాటా ధరలు కేజీ రూ. 5కు భారీగా పడిపోయాయి. టమాటాల దిగుబడి పెరగడంతో ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో టమాటా రైతులు వారికి గిట్టుబాటు ధరలను కల్పించాలని కోరుతున్నారు.

ఉల్లిపాయలతో భారీగా నష్టపోతున్నామని ఇప్పుడు టమాటాల వల్ల మరింతగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు టమాటా పంట వేయడం పూర్తిగా తగ్గించేశారు. చేతికొచ్చిన పంటను తీయకుండానే అలానే వదిలేస్తున్నారు. టమాటాల వల్ల ఎలాంటి లాభం ఉండడం లేదని బాధపడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయం పైన వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఈ విషయం పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.