తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వచ్చే వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్ మొదటి వారం వరకు తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని సూచించిన హైదరాబాద్ వాతావరణ శాఖ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

ఉత్తర తెలంగాణలో ఎక్కువగా, ద క్షిణ తెలంగాణలో మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సికింద్రాబాద్, విద్యానగర్, అంబర్పేట్, మాదాపూర్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, నాంపల్లి, మల్లేపల్లి, రాజేంద్ర నగర్, అల్వాల్, బోయినపల్లి, బేగంపేట్, కాప్రా, మల్కాజ్ గిరి,