హైదరాబాద్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన లో ఏకంగా ఇద్దరు యువకులు మృతి చెందారు. సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది.

ఇక ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కార్ఖాన, మచ్చ బొల్లారం ప్రాంతాలకు చెందిన కొండగల కార్తీక్(19), టంగుటూరి మల్లికార్జున్(20) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది.