ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసి..ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిసతున్నారు బోండా ఉమా.

బోండా ఉమా ద్వంద వైఖరితో గందరగోళంలో కూటమి నేతలు ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పై అసెంబ్లీలో విమర్శలు, బయట ప్రశంసలు చేశారు. పవన్ నాయకత్వం వల్లే ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ట్వీట్ చేశారు. అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంపై ఛైర్మన్ పనితీరు బాగాలేదని కామెంట్ చేశారు ఉమా. ఎమ్మెల్యే బోండా ఉమా తీరుపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు పవన్‌కళ్యాణ్.