శరీర బలం, బ్యాలెన్స్ కోసం శిల్పా శెట్టి చేసే ఈ యోగా పోజ్ తప్పక నేర్చుకోండి..

-

నటి శిల్పా శెట్టి అంటేనే మనకు మొదట గుర్తుకొచ్చేది ఆమె ఫిట్‌నెస్ మరియు యోగాపై ఆమెకున్న అపారమైన ప్రేమ. తన వయసులో సగం మంది కంటే ఎక్కువగా ఆమె యోగాతో ఫిట్‌గా ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కేవలం నాజూకుగా ఉండటమే కాదు, శరీరం దృఢంగా, మనసు ప్రశాంతంగా ఉండటానికి ఆమె ఒక అద్భుతమైన యోగా పోజ్‌ను తరుచూ చేస్తుంటారు. ఈ పోజ్ శరీర బలాన్ని ఏకాగ్రతను మరియు బ్యాలెన్స్‌ను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ దైనందిన జీవితంలో చురుకుగా ఉండాలనుకుంటే, తప్పకుండా ఆమె చేసే ఆ పవర్‌ఫుల్ యోగాసనం ఏంటో దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..

పోజ్ -1: శిల్పా శెట్టి చేసే పోజులలో వృక్షాసనం ఒకటి. ఇది పేరుకు తగ్గట్టుగానే మనల్ని ఒక చెట్టులా స్థిరంగా, బలంగా నిలబడేలా చేస్తుంది. వృక్షాసనం అనేది హఠా యోగాలో ఒక భాగం. ఇది కేవలం శారీరక బలాన్ని మాత్రమే కాకుండా, మానసిక ఏకాగ్రతను కూడా పెంచే అద్భుతమైన ఆసనం. ఈ పోజ్‌ను రోజూ సాధన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

The Yoga Pose Shilpa Shetty Swears by for Strength and Balance
The Yoga Pose Shilpa Shetty Swears by for Strength and Balance

ఫోజ్ -2: ముందుగా రెండు కాళ్లపై నిటారుగా నిలబడండి, దృష్టిని ఒక స్థిర బిందువుపై కేంద్రీకరించండి. కుడి కాలి మడమను పైకి లేపి, ఎడమ కాలి తొడ లోపలి భాగంలో ఉంచండి (పాదాన్ని వీలైనంత పైకి తీసుకురావాలి. మీ రెండు చేతులను తల పైకెత్తి, నమస్కార ముద్రలో ఉంచండి. భుజాలు రిలాక్స్‌డ్‌గా ఉండాలి. నిలబడిన కాలు నేలపై గట్టిగా నాటుకున్నట్లుగా ఉంచి, శరీరాన్ని బ్యాలెన్స్ చేయండి. ఈ స్థితిలో 30 సెకన్ల నుండి ఒక నిమిషం పాటు ఉండి, శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. తర్వాత నెమ్మదిగా కాళ్లు మార్చి, అదే విధంగా చేయండి.

ప్రయోజనాలు: శారీరక బలం మరియు బ్యాలెన్స్: ఇది తుంటి కీళ్లను, తొడ కండరాలను మరియు పాదాలను బలపరుస్తుంది. ముఖ్యంగా, శరీర బ్యాలెన్స్‌ను (సమతుల్యత) అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత: ఒకే బిందువుపై దృష్టి పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ఏకాగ్రత పెరుగుతుంది. శిల్పా శెట్టి చేసే వృక్షాసనం మనకు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. ఒక చెట్టులా స్థిరంగా నిలబడటం అనేది జీవితంలో ఒడుదొడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ రోజూవారీ వ్యాయామంలో ఈ అద్భుతమైన ఆసనాన్ని చేర్చడం ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా ఉండండి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, యోగాసనాలు చేసేటప్పుడు మీకు ఏమైనా శారీరక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే, తప్పకుండా యోగా నిపుణుడు లేదా వైద్యుడి సలహా మేరకు మాత్రమే సాధన చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news