బిగ్ బ్రేకింగ్; రాష్ట్ర, జిల్లా సరిహద్దులను మూసి వేయండి; కేంద్రం…!

-

రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసి వేయాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయ౦ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు సంచలన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోం శాఖ. రాష్ట్రాల మధ్య నిత్యావసర సరుకులను మాత్రమే అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా రాష్ట్రాలు జిల్లాల మధ్య ప్రయాణాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

ఇప్పటికే సరిహద్దులు దాటిన వాళ్లను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశించింది. నిభందనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు సరిహద్దులను మూసి వేసాయి.

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యికి దాటింది. రాబోయే పది రోజులు ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తికి కీలకంగా ఉన్నాయి. దీనితో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. విద్యార్ధులు, కార్మికులు, ఉద్యోగులను ఇళ్ళు ఖాళీ చెయ్యాలని ఒత్తిడి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news