అభిమానులకు నితిన్ రిక్వెస్ట్ !

-

కరోనా ఎఫెక్ట్ తో నష్టపోయిన చాలా కుటుంబాలను ఆదుకునేందుకు టాలివుడ్ నుంచి ముందుకొచ్చిన మొదటి హీరో నితిన్ అనే చెప్పాలి. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు నితిన్ రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు. అయితే రీసెంట్ గా నితిన్ తీసిన భీష్మ సినిమా సూపర్ హిట్ అయింది. దీనితో పాటు తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో తన పెళ్లిని కూడా నితిన్ వాయిదా వేసుకున్నాడు. అయితే నితిన్ బర్త్ డే సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఒక సందేశాన్ని పంపాడు.

నితిన్ తన అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేసాడు. నన్ను అభిమానించే వారందరికీ నమస్కారం. మార్చి30 వ తారీఖు న నా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నాను. పుట్టిన చేసుకోవడం లేదు. కాబట్టి నా అభిమానులు దయచేసి ఎటువంటి హడావిడి చెయ్యొద్దు.మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.  దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని మనవి చేస్తున్నాను. అలాగే ఏప్రిల్ 16 న జరగాల్సిన నా వివాహాన్ని కూడా వాయిదా వేసు కుంటున్నాను ఎప్పుడు అనేది తరువాత మీతో పంచుకుంటాను. అర్థం చేసుకుంటారని మనవి. అంటూ తన అభిమానులకు సందేశం పంపించాడు.

ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తన బర్త్ డే వేడుకలకు దూరంగానే ఉన్నాడు. తన పుట్టినరోజు నాడు ఎలాంటి వేడుకలు, సంబరాలు జరుపుకోవద్దని అభిమానులను రిక్వెస్ట్ చేశాడు. కరోనాపై పోరాటం కోసం మన తెలుగు హీరోలు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలపై నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news