ఏపీ తెలంగాణాలో భారీ ఆపరేషన్…!

-

ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ప్రభుత్వాలు ఇప్పుడు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వందల మంది ఢిల్లీ వెళ్లి వచ్చారని అధికారులు తమ విచారణలో గుర్తించారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి సహా పలు ప్రాంతాల్లో వాళ్ళు దిగారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది అర్ధం కావడం లేదు. ఢిల్లీ జమాత్ సభలకు వెళ్లి తిరిగి తెలుగు రాష్ట్రాలకు వచ్చారు.

ఇప్పటికే కొంత మందిని గుర్తించిన ఏపీ, తెలంగాణ పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం 11 మంది అనుమానితుల్ని గుర్తించారు. వారి నమూనాలను సేకరించి వైద్య పరిక్షలకు పంపించారు. జమాత్‌కి వెళ్లి వచ్చిన గుంటూరు, ప్రకాశం జిల్లాల వారిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఆందోళన మొదలయింది. పాజిటివ్‌గా తేలిన వారి కుటుంబాల్లో 150 మందిని ఇప్పటికే అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూరుకి చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లాలో 12 మందిని, రాజమండ్రిలో 21 మందిని ఐసోలేషన్ వార్డులకు పంపారు. నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 40 మంది వెళ్ళగా వారిపై అనుమానం ఉండటంతో… 25 మందిని క్వారంటైన్‌ను ప్రస్తుతం తెలంగాణలో 70, ఏపీలో 23 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు బయటపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news