ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్‌కు చైనా క్యూర్‌ను కనిపెట్టిందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే ఓ ఆంగ్ల దినపత్రిక ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ విషయాన్ని వెల్లడించింది. దాని ప్రకారం.. కరోనా వైరస్‌ను నాశనం చేసే ఓ నానో మెటీరియల్‌ను చైనా కనిపెట్టిందని తెలిసింది.
కరోనా వైరస్‌ను నాశనం చేసే ఓ నానోమెటీరియల్‌ను చైనా కనిపెట్టిందని.. కాకపోతే అది మెడిసిన్ కాదని.. ఆ నానోమెటీరియల్ మన శరీరంలో ఉండే కరోనా వైరస్‌ను 96.5 నుంచి 99.9 శాతం వరకు శోషించుకుంటుందని (absorb).. సదరు ఆంగ్ల దినపత్రిక తన ట్వీట్‌లో తెలిపింది. అయితే ఈ విషయాన్ని మాత్రం చైనా బయటి ప్రపంచానికి ఇంకా చెప్పకపోవడం పలు అనామానాలకు తావిస్తోంది.
Chinese scientists have developed a new weapon to combat the #coronavirus. They say they have found a nanomaterial that can absorb and deactivate the virus with 96.5-99.9% efficiency. pic.twitter.com/ESFUOoTuIX
— Global Times (@globaltimesnews) March 29, 2020
సాధారణంగా నానోమెటీరియల్ అన్న పదం మనకు కొత్తేమీ కాదు. ఇప్పటికే హెల్త్‌కేర్, మానుఫాక్చరింగ్, పెయింట్లు, ఫిల్టర్లు తదితర అనేక ఉత్పత్తుల్లో వీటిని వాడుతున్నారు. ఈ క్రమంలో చైనా నానో మెటీరియల్‌ను కరోనా వైరస్‌ను నాశనం చేసేందుకు ఉపయోగిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ విషయం నిజమే అయితే.. నిజంగా కరోనా వల్ల మనకు భారీ ఊరట లభించినట్లే అవుతుంది. మరి చైనా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తుందా.. ప్రపంచాన్ని కాపాడుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!