మూడు నెలల ఈఎంఐ మారటోరియం‌కు ప్రైవేట్ బ్యాంకులు రెడీ…!

-

కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ని 21 రోజుల పాటు అమలు చేయనున్నారు. దీనితో ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా ఉండటానికి గానూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విషయమై అంగీకారం కూడా తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా దీనిపై తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. తమ ఖాతాదారులకు మూడు నెలల ఈఎంఐ మారటోరియం ఆప్షన్‌ను యాక్టివేట్ చేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి బ్యాంకులు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల యాజమాన్యాలు ఖాతాదారులకు ఇప్పుడు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఆర్బిఐ ప్రకటించిన విధానం ప్రకారం ఈ మూడు నెలల సమయంలో,

ఈఎంఐ కట్టకపోయినా సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదని బ్యాంకులు పేర్కొన్నాయి. కాని వడ్డీ మాత్రం వర్తిస్తుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులు మారటోరియం ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే బ్రాంచికి ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపాలి. ఈ వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది బ్యాంకు. ఖాతాదారులు ఈఎంఐ ఎప్పటిలాగే చెల్లించాలని అనుకుంటే మాత్రం ఎలాంటి అభ్యర్థన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news