అమ్మ మనసు చాటుకున్న రోజా…!

-

ఆర్కే రోజా… ఈ పేరు వినగానే మనకు ముందు ఆమె వివాదాస్పద వైఖరే కళ్ళ ముందు ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలు చేసే విమర్శలు అన్నీ కూడా వివాదాస్పదంగా ఉండటంతో ఆమెను అందరూ అలాగే చూస్తారు. కాని ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం రోజా స్పందించే తీరు నిజంగా అభినందనీయం. ఆర్ధిక సహాయం చేయడమే కాదు నలుగురికి అన్నం పెట్టే విషయంలో రోజా ఎప్పుడూ ముందు ఉంటారు.

ఇటీవల సినీ కార్మికుల కోసం ఆమె వంద బియ్యం బస్తాలు ఇవ్వడమే కాదు ఆర్ధిక సహాయం చేయడానికి కూడా ఆమె ముందుకి వచ్చారు. ఇక ఇప్పుడు ఆమె మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయడానికి ముందుకి వచ్చిన ఆమె ఇప్పుడు ప్రాణాలకు తెగించి పోరాటం చేసే పోలీసుల కోసం ఏకంగా అన్నం వండి పెట్టారు. పోలీసుల కోసం తానే స్వయంగా వంట చేసి పెట్టారు.

ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతుంది. అలాగే డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల కోసం మధ్యాహ్న భోజన సదుపాయాన్ని రోజా కల్పించారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. తానే స్వయంగా కూరగాయలు కోసి, వంట చేశారు. అనంతరం రోజా స్వయంగా భోజనం వడ్డించడంపై ఇప్పుడు ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news