ఇన్ని లోపాలు ఉంచుకుని కరోనా మీద ఎలా పోరాటం చేస్తారు బాసూ…?

-

చైనా ఇప్పుడు కరోనా నుంచి బయటపడింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో అక్కడి ప్రభుత్వం చాలా సమర్ధవంతంగా పని చేసింది. ఎక్కడిక్కడ కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్రణాలికా బద్దంగా చేసుకుంది. చాలా అప్రమత్తంగా వ్యవహరించింది చైనా. ఎక్కడా కూడా అలసత్వ వైఖరి ప్రదర్శించలేదు. చైనాకు దాని తీవ్రత తెలుసు. చైనాకు దాని ప్రభావం అన్ని విధాలుగాను అర్ధమైంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకి వెళ్ళింది. వైద్య రంగం మీద లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ౦ ఖర్చు పెట్టింది. ఒక్క వైద్య రంగం మీదే చైనా ఖర్చు పెట్టిన సొమ్ము మన కరెన్సీ ప్రకారం 7 లక్షల కోట్లు. వైద్య సిబ్బంది నుంచి మున్సిపల్ సిబ్బంది వరకు కూడా ఎన్నో పరికరాలను అందించింది. వారి రక్షణ నుంచి వైద్యుల రక్షణ వరకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది ఆ దేశం. అందుకే చైనా దాని నుంచి సమర్ధవంతంగా బయటపడింది.

చైనా కరోనా వైరస్ ని ఎక్కడా తేలికగా తీసుకున్న సందర్భం అనేది లేదు. అందుకే ఆ దేశం నేడు ఊపిరి పీల్చుకుంది. మనం వైద్య సిబ్బందికి ఖర్చు చేయం, వాళ్లకు పరికరాలు కొనుగోలు చేయలేం, వైద్య రంగం మీద ఖర్చు చేయలేని పరిస్థితి మన దేశానికి ఉంది. అందుకే కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆర్ధిక శాఖ దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వైద్య రంగానికి భారీగా ఖర్చు చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news