ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ముందు నుంచి కూడా కాస్త వివాదాస్పదంగా వ్యవహరించడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు ఎం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంటే వాళ్ళు మాత్రం జగన్ భూస్థాపితం చేసారు అంటూ ఏదేదో మాట్లాడుతూ చులకన అవుతున్నారు.
వాళ్లకు జగన్ చెప్పినా మరొకరు చెప్పినా సరే వినే పరిస్థితి ఉండటం లేదు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వాలంటీర్ల గురించి అనవసర ప్రచారం చేస్తున్నారు. జలుబు జ్వరం ఏ ఇంట్లో ఉన్నాయో ఇలాగే చెప్తుంది ప్రభుత్వం అన్నారు. ఆయన ఆ ట్వీట్ చేసిన రోజు 40 కేసులు పెరిగాయి. దాని గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా కేసులు పెరుగుతూ వస్తుంటే చంద్రబాబు కరోనా రావాలి అనుకుంటున్నారు,
అంటూ అర్ధం లేని మాటలు మాట్లాడటం మొదలు పెట్టారు. వీళ్ళు బాగానే ఉంటున్నారు గాని ఆ మాటల ప్రభావం జగన్ మీద ఎక్కువగా పడుతుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. చికిత్స కోసం ఐసోలేషన్ వార్డులను ప్రభుత్వం మొదలుపెట్టింది. వాటిని హడావుడిగా ప్రారంభించడానికి వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు వైసీపీ నేతలు.
ఈ చేష్ట చూసి షాక్ అయ్యారు అందరూ కూడా. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. అవి జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దారుణంగా ఉండేది. అంచనా వేయడానికి కూడా కుదిరేది కాదు. మంత్రి కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద దుమారం చెలరేగింది. ఇప్పుడు దీనితో వాళ్ళు అనవసరంగా తెలుగుదేశం చేతికి జుట్టు ఇస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.