టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో జగపతి బాబు. ఎంత మందికో ఫేవరేట్ హీరోయిన్ సౌందర్య. పదుల కొద్దీ సినిమాలు చేసిన ఆమె ఎందరో అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఆమెతో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకులు ఎందరో ఉన్నారు. ఆమె సినిమాల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉండే వారు. ఇక జగపతి బాబు, సౌందర్య ఈ కాంబినేషన్ కి అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి.
మూడు ముక్కలాట, అల్లరి ప్రేమికుడు, భలే బుల్లోడు ఇలా చాలా సినిమాలు కలిసి నటించారు. వీరిని చూసి వీరి మధ్య ఏదో ఉంది అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది అప్పట్లో. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో ఇది నిజమే అని స్పష్టం చేసారు జగపతి బాబు. తనకు సౌందర్యకు అఫైర్ ఉందని స్పష్టంగా చెప్పాడు. సౌందర్యతో తనకు ఎఫైర్ ఉందని ఓపెన్ గానే చెప్పేశారు జగపతి బాబు.
అవును అప్పట్లో సౌందర్యతో నాకు అఫైర్ ఉండేదని, కాని అది అంతా అనుకుంటున్నట్లు లైంగిక సంబంధం కాదని అన్నాడు. సౌందర్య అన్నయ్య అమర్ కూడా తనకు బాగా క్లోజ్ అని… రెండు కుటుంబాలు తరుచుగా కలుసుకుంటూ ఉండేవని చెప్పుకొచ్చాడు. సౌందర్య ఇంటికి తాను తన ఇంటికి సౌందర్య కూడా తరుచూ వస్తుండేదని వివరించాడు. అందుకే జనం కూడా తప్పుగా అనుకున్నారని అన్నాడు. కానీ సౌందర్య అలాంటిది కాదని స్పష్టంగా చెప్పాడు.