దీపం శాస్త్రీయత.. వెలిగించడంలో ఎన్ని అర్ధాలు ఉన్నాయో…!

-

దేశంలో కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని చెప్పినా సరే… ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇస్తున్న పిలుపులు మాత్రం ఆసక్తి కరంగా ఉంటున్నాయి. జనతా కర్ఫ్యూ పిలుపు ని ప్రజలు విజయవంతం చేసి వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సాయంత్రం అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆదివార౦ సాయంత్రం 9 గంటలకు దీపాలు వెలిగించాలి అని పిలుపునిచ్చారు.

దీని వెనుక చాలా పెద్ద అర్ధం ఉందీ అనేది ప్రముఖ జ్యోతిష్యుల మాట. చాలా మంది శాస్త్రాలను సాంకేతికత తో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. భారత దేశంలో పురాతన కాలం నుంచి సనాతన జ్యోతి ప్రజల్వనకు చాలా ప్రాధాన్యత ఉందనే విషయం అందరికి తెలుసు. ఏ కార్యక్రమం అయినా సరే జ్యోతి ప్రజ్వలన లేకుండా ప్రారంభించే అవకాశం ఉండదు. కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఎవరైనా చనిపోయినా సరే తల దగ్గర దీపం పెడుతుంటారు మన భారతీయులు. కాంతికి ఏ వస్తువులోకైనా ప్రవేశించే మహాశక్తి ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఎక్కడ అయితే జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుందో అక్కడ, ఆ ప్రాంతం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఆ దీపాల్లోకి మనం తదేకంగా చూసినట్లు అయితే మన కళ్ళల్లో ఉన్న దోషాలు తోలుగుతాయి. అంతే కాకుండా అక్కడ ఉన్న పర్యావరణం అంతా కూడా శుద్ధి అవుతుందనేది జ్యోతిష్యులు చెప్పే మాట.

అతి సూక్ష్మ క్రిములు ఆ ప్రాంతంలో ఏమైనా ఉన్నా సరే ఆ దీపానికి తగిలి చనిపోతాయి. కరోనా కూడా చనిపోతుంది అనేది కొందరి నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లు అయితే… తులలగ్నం కావడమే కాకుండా.. లగ్నాధిపతి అయిన శుక్రుడు ఉండడంతో, సింహరాశిలో పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కావడం వంటి అంశాలన్నీ శుభసూచకంగా పనిచేస్తాయనేది కొందరి మాట. వివాదాలు మాని దీనిని విజయవంతం చేసి అఖండ భారతాన్ని దీపాలతో వెలుగెత్తి చాటుదామని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news