అబ్బే అస్సలు హ్యాపీగా లేరు .. జగన్ నిర్ణయం రివర్స్ గేర్ !

-

వైరస్ దెబ్బకు జగన్ పరిపాలన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విభజనతో ఆర్థికంగా నష్టపోయినా రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు పైగా తాజాగా కరోనా వైరస్ తిప్పల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సీఎం జగన్. ఇటీవల బడ్జెట్ రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే విషయంలో రెండు విడతల్లో జీతం ఇస్తామని జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసలు హ్యాపీ గా లేరు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఉందని పైగా కరోనా వైరస్ దెబ్బకు చాలావరకూ ఖజానా కి చిల్లు పడినట్లు ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ప్రభుత్వ ఉద్యోగస్తులు విమర్శలు చేస్తున్నారు.Yellow Media's Edupu On Andhra Pradesh Chief Minister Y S Jagan ...ఇష్టానుసారంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రకటించి పరిపాలన చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఉద్యోగస్తులో మాటలు వినబడుతున్నాయి. గత మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే నెల కావడంతో చాలా వరకు దాచుకున్న డబ్బులు అటు పోయాయి అని ఉద్యోగస్తులు తమ బాధ వెల్ల బుచ్చుకుంటున్నారు. మా కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు అని మరికొంతమంది లబోదిబోమంటున్నారు.

 

పైగా ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్ లో 30వేల కోట్లు అధికంగా వచ్చాయని కాబట్టి ప్రభుత్వం ఒక విడతలోనే ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో జగన్ తీసుకొన్ననిర్ణయం రివర్స్ గేర్ అయింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news