దేశంలో మూడో దశలో కరోనా…? ఎయిమ్స్ చెప్పింది ఇదే…!

-

మన దేశంలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో విదేశీయుల నుంచి మన దేశంలో వచ్చిందని కాని ఇప్పుడు మాత్రం భారతీయుల నుంచే భారతీయులకు వ్యాపిస్తోందని, మూడో దశకు చేరినట్లేనని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక విషయం వెల్లడించారు.

ఇప్పుడు ఈ దశను కట్టడి చేయకపోతే మాత్రం నాలుగో దశకు వైరస్ చేరే అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాన్ని కట్టడి చేయడం అనేది దాదాపుగా సాధ్యం కాదు. భారీగా ప్రాణ నష్టం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4281కి చేరుకుంది. సోమవారం ఒక్క రోజే దేశంలో 704 కేసులు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో 500 దాటాయి కరోనా కేసులు.

ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి దేశంలో కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడు వారి నుంచే కరోనా సోకింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మూడో దశ కనిపిస్తోందని ఎయిమ్స్ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే ఇబ్బందులు వస్తాయని పలువురు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news