మీడియాపై చాలా సీరియస్ గా కేసీఆర్…!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. కరోనా విషయంలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది. అయినా సరే కొన్ని పత్రికలూ, వెబ్ సైట్స్ పదే పదే చిన్న చిన్న లోపాలను దృష్టిలో పెట్టుకుని కథనాలు రాయడం మొదలుపెట్టాయి. దీనిపై ఇప్పుడు కేసీఆర్ మండిపడుతున్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… ఒక పత్రికను పేరు లేకుండా ప్రస్తావిస్తూ విమర్శలు చేసారు. వాళ్ళను వదిలే సమస్య లేదని ఆయన చాలా వరకు స్పష్టంగా చెప్పారు. అనవసరంగా తప్పుడు రాతలు రాస్తే క్షమించే ప్రశ్నే ఉండదు అంటూ కేసీఆర్ ఆగ్రహంగా మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనిపై మీడియా ఎక్కువగా హడావుడి చేస్తుంది.

తీవ్రత తక్కువగానే ఉన్నా సరే కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా కొన్ని కొన్ని పత్రికలూ అనవసర రాతలు రాస్తున్నాయి. ఇప్పుడు వాటిని అవసరం అయితే కోర్ట్ కి లాగే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మాట వినకపోతే సోషల్ మీడియా లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఇప్పుడు కొన్ని కొన్ని పత్రికల మీద కేసులు పెట్టే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news