యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు… 42 మంది నర్సులకు కరోనా అంటించాడు…?

-

మీరు ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వస్తే తమకు చెప్పాలని ప్రభుత్వాలు దాదాపు 20 రోజుల నుంచి కోరుతూనే ఉన్నాయి. మీకు ఉచితంగా చికిత్స అందిస్తామని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ప్రభుత్వాలు చెప్తున్నా సరే ఎవరూ కూడా వినడం లేదు. బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనితో ప్రభుత్వాలే రంగంలోకి దిగి వారిని పట్టుకుని చికిత్స చేయడం, క్వారంటైన్ కి తరలించడం వంటివి చేస్తున్నాయి.

coronavirus

తాజాగా ఒక వ్యక్తి తన వ్యాధిని 42 మందికి అంటించాడు. అసలు ఎం జరిగింది…? మహారాష్ట్ర పూణే లో ఒక రోడ్డు ప్రమాద బాధితుడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ముందు జాగ్రత్తగా అధికారులు… అతను ఎక్కడికి అయినా వెళ్లి వచ్చాడా అని కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అతను ఎక్కడికి వెళ్ళలేదు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అతనికి మొత్తం 42 మంది చికిత్స చేసారు.

అయితే అతనికి ముందు జ్వరం వచ్చింది. దీనితో కంగారు పడిన కుటుంబ సభ్యులు అతను ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చినట్టు వివరించారు. అతనికి కరోనా పరిక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీనితో అప్రమత్తమైన వైద్య శాఖ 42 మందిని నర్సులను ఐసోలేషన్ కి తరలించి చికిత్స చేస్తుంది. ఇప్పుడు వారికి కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఇక అతనితో సంబంధం ఉన్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news