ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ ని తప్పించడంలో సిఎం జగన్ అనవసరంగా తొందర పడ్డారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయనపై అధికార పార్టీ నేతలు పదే పదే విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. కులం పేరుతో ఆయనపై విమర్శలు చేయడమే కాకుండా టీడీపీ అధ్యక్షుడు ఆయన అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్టు రమేష్ కుమార్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇప్పుడు ఆయన్ను ఏ విధంగా అయినా సరే తప్పించాలని భావించిన జగన్… ఎన్నికల కమీషనర్ పదవి కాలం తగ్గిస్తూ ఒక ఆర్డినెన్స్ ని గవర్నర్ ద్వారా తీసుకొచ్చారు. దీనితో ఆయన్ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ళ పదవీ కాలంతో ఆర్డినెన్స్ ని తీసుకు రావడం ఆయనకు ఆ నిబంధనల ప్రకారం… పదవీ కాలం ముగిసిన నేపధ్యంలో ఆయనను తప్పించారు. అయితే ఇది సాధ్యమవుతుందా…? ఇప్పుడు దీనిపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమీషనర్ ని తప్పించడం అనేది రాజ్యాంగ విరుద్దం అని అంటున్నారు.
ఎన్నికల కమీషనర్ కి, హైకోర్ట్ జడ్జ్ కి అవే ఉత్తర్వులు వర్తిస్తాయి. గవర్నర్ నుంచి ఒకసారి నియామకం జరిగిన తర్వాత… పదవీ కాలం 5 ఏళ్ళ పాటు ఉంటుంది. దాన్ని రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు రమేష్ కుమారు సుప్రీం కోర్ట్ కి వెళ్తే మాత్రం ప్రభుత్వానికి దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎలక్షన్ కమిషనర్ తొలగింపు అంత సులభం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో అసహనానికి కారణం అవుతుందని జగన్ అనవసరంగా తొందర పడి నిర్ణయం తీసుకుని ప్రజల్లో క్రెడిబిలిటి పోగొట్టుకున్నారని అంటున్నారు