కరోనా వైరస్ వల్ల అమెరికా మరియు యూరప్ దేశాలలో అనేక పాజిటివ్ కేసులతో పాటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే ఈ వైరస్ ఆసియా దేశాలలో ఎక్కువ విస్తరించకుండా ఉండటానికి గల కారణాన్ని సీక్రెట్ నీ చైనాలోని సిచువాన్ వర్సిటీ.. యిబిన్ వర్సిటీకి చెందిన ఇద్దరు డాక్టర్లు బయటపెట్టారు.ప్రపంచంలో ఉష్ణ దేశాలు గా పిలవబడే దేశాలలో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉండటానికి గల కారణం మలేరియా అని చెప్పారు. ఒకానొక టైములో ఉష్ణ దేశాలలో మలేరియా వ్యాధి భయంకరంగా సంభవించింది. ఆ టైంలో మలేరియా కు సంబంధించిన మందులు ఉష్ణ దేశాలు ఎప్పటినుండో వాడటంతో కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపించలేక పోతున్నాట్లు ఈ డాక్టర్ల పరిశోధనలో తేలింది.
వారు చెప్పేదాని ప్రకారం కరోనాలోని ఓఆర్ఎఫ్ 8.. సర్ఫేస్ గ్లైకో ప్రోటీన్ హిమెగ్లోబిన్ పై ఉండే హీమ్స్ (ఐరన్ అయాన్ ఉండే పొర్ఫిరిన్స్) కు అతుక్కుంటాయి. మరింత వివరంగా చెప్పాలంటే కొవిడ్ 19 శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ వైరస్ పై ఉండే సర్ఫేస్ గ్లైకో ప్రొటీన్ ఈ ఐరన్ అయాన్ ను హీమ్స్ నుంచి తొలగిస్తుంది. అయితే అమెరికా మరియు యూరప్ వంటి దేశాలలో ఎక్కువగా మలేరియా కి సంబంధించి సమస్య ఎప్పుడు రాకపోవడంతో ప్రస్తుతం కరోనా వైరస్ ని ఎదుర్కొనలేక పోతున్నారని మలేరియా తో ముడిపెట్టి కరోనా విషయం లో సంచలన సీక్రెట్ బయట పెట్టారు చైనా డాక్టర్లు.