తెలంగాణా లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఒక్క రోజే రాష్ట్రంలో 50 కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణాలో నమోదు అయిన కేసుల సంఖ్య 700 కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు 68 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 186 గా ఉంది.
ఈ కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త కేసులు అన్నీ కూడా హైదరాబాద్ పరిదిలోనివే అని మంత్రి ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. ఫ్లాస్మా థెరపి కోసం దరఖాస్తు చేసామని ఆయన వివరించారు. ఇక హైదరాబాద్ లో లాక్ డౌన్ ని కతినంగా అమలు చెయ్యాలి అని భావిస్తున్నారు. ఈ నెల 19 న ప్రగతి భవన్ లో కేబినేట్ సమావేశం జరగనుంది.