అలజడి; 23 మంది పోలీసులకు కరోనా…!

-

కరోనా ను కట్టడిచేసెందుకు ఒక పక్క ప్రజలు, ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తుంటే మరోపక్క ఏటువైపు నుంచి వస్తుందో అర్దం కాకుండా చొచ్చుకొస్తుంది ఈ కరోనా వైరస్. ఇప్పటికే కరోనా సోకిన వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్స్ లు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు వారే కాకుండా కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసే పోలీసులకు ఇది సోకడం ప్రారంభించింది.

ముంబై నగరంలో భాద్యతలు నిర్వహిస్తున్న 15మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసిన ఏడుగురు పోలీసు అధికారులతో సహా మరో 16మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఈ వైరస్ సోకింది. ఇప్పటికే పలుచోట్ల ఆసుపత్రుల్లో చేరిన 23 మంది పోలీసులు కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు.

రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ పోలీసుల కోసం ప్రత్యేకంగా మొబైల్ డిస్ ఇన్పెక్షన్ వ్యాన్ ను ఏర్పాటుచేశారు. లాక్ డౌన్ కారణంగా 97 మంది పోలీసులపై దాడి చేసిన 162మందిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 46,671 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, వారిలో 9,155మందిని అరెస్టు చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన,

31,296 వాహనాలను సీజ్ చేసి, ఉల్లంఘనుల నుంచి రూ.1.7 కోట్ల జరిమానాను పోలీసులు వసూలు చేశారు. అయితే ఒకపక్క లాక్ డౌన్ ను సురక్షితంగా పాటించడానికి ప్రజలను రక్షించే పోలీసులకు కరోనా వైరస్ సోకడం వల్ల వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్రలో ఒక్కసారిగా 23 మంది పోలీసులకు ఈ వైరస్ సోకడం సంచలనం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news