వాట్సాప్ వలన ఎన్నో నష్టాలు ఉన్నాయి అనేది మాట్లాడుతూ ఉంటారు గాని లాభాల గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరూ కూడా చేయరు. వాట్సాప్ తో నష్టాలు ఎన్ని ఉన్నాయో లాభాలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం కరోనా తో వాట్సాప్ చాలా వరకు అండగా నిలుస్తుంది ప్రజలకు. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ గ్రూప్ లో కొంత మంది సహాయం చేసే మనస్తత్వం ఉన్న వారిని యాడ్ చేస్తున్నారు.
వారి నుంచి డబ్బులను ఒక ఫోన్ పే కో గూగుల్ పే కో సేకరిస్తున్నారు. ఆ డబ్బులకు సరిపడా సరుకులను కొనుగోలు చేసి ప్రజలకు పంచె కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను గ్రూప్ అడ్మిన్ స్వీకరిస్తున్నాడు. సోషల్ మీడియా లో కీలకమైన ఫేస్బుక్ కూడా దీనిపై చాలా సహాయం చేస్తుంది. వాట్సాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించే అవకాశాలు ఉంటున్నాయి. ఇక ఫేస్బుక్ ద్వారా పాలకులకు సమాచారం అందించవచ్చు.
లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింతగా సహాయం చేస్తూ వస్తుంది. పేదలకు తన వంతుగా సహాయం చేస్తుంది వాట్సాప్. ఆ సంస్థ సహాయం చేయకపోయినా ఈ విధంగా ఎందరో కడుపులు నింపుతుంది. ఇక రక్తదానం సహా అనేక కార్యక్రమాలకు వాట్సాప్ అండగా నిలబడుతుంది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యాప్ ఎందరికో ఆపదలో అండగా నిలుస్తుంది.