ఈ పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందో చూడండి…!

-

కరోనా లాక్ డౌన్ లో ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ చిన్న కార్యక్రమం కూడా ప్రశాంతంగా జరిగే పరిస్థితి కనపడటం లేదు. కరోనా ఎక్కడ వస్తుందో అనే ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతుంది. కరోనా వైరస్ నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఒక పెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వధూవరులు ఇద్దరూ కూడా తమ వివాహం సమయంలో మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించారు. తమ పెళ్ళికి స్నేహితులను పిలవలేదు. బంధువులను పిలవలేదు… కేవలం అమ్మాయి తరుపు ఒక ముగ్గురు అబ్బాయి తరుపున ఒక ముగ్గురు… ఆరుగురి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పంతులు గారు ఎలాగూ ఉంటారు. ఇద్దరినీ పిలవకుండా ఒక్కరినే పిలిచి ఈ వివాహం చేసుకున్నారు.

పూజ, దిశాంక్‌ లు ఇలాగే గురువారం చాలా జాగ్రత్తగా వివాహం చేసుకున్నారు. అది కూడా ఇంటి టెర్రస్ మీద ఈ వివాహం జరిగింది. తల్లి తండ్రులు కూడా గ్లోవ్స్ ధరించి ఈ వివాహం చేసుకున్నారు. అదే విధంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బంధుమిత్రులకు వీడియోకాల్స్ లో చూపించామని వరుడు వివరించాడు. ఇక పెళ్లి ఖర్చులు తగ్గడంతో దీనిపై ఇప్పుడు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news