అవును వచ్చే రెండు వారాలు ఇప్పుడు తెలంగాణా భవిష్యత్తు కి చాలా కీలకమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. తెలంగాణా లో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతుంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. లాక్ డౌన్ ని తెలంగాణా సర్కార్ అత్యంత కఠినం గా అమలు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో నిన్న ఒక్క రోజే కరోనా కేసులు… భారీగా నమోదు అయ్యాయి.
తెలంగాణాలో నిన్న ఒక్క రోజే 66 మందికి కరోనా వైరస్ బయటపడింది. మరణాలు ఏమీ లేవు. తెలంగాణా ప్రభుత్వం ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన సమీక్షలు చేస్తున్నారు. అయినా సరే కరోనా మాత్రం కట్టడి కావడం సాధ్యం కావడం లేదు. రాబోయే రెండు వారాల్లో కేసులు ఎన్ని పడతాయి అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.
తెలంగాణా సర్కార్ కూడా రాబోయే రెండు వారాల లాక్ డౌన్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ రెండు వారాల్లో కేసులు నమోదు అయ్యాయి అంటే మాత్రం కట్టడి చేయడం చాలా కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ రెండు వారాలు కూడా లాక్ డౌన్ లో ఏ విధంగా కూడా మినహాయింపులు ఇవ్వకుండా ఉండటమే మంచిది అని భావిస్తుంది. రెండు వారాల్లో గనుక కేసులు పెరిగితే అది తెలంగాణా భవిష్యత్తుకే ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తు౦ది.