పేదరికం ఉన్నా సరే ఆకలి తీరుస్తున్న గ్రామస్తులు…!

-

దేశ వ్యాప్తంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. లాక్ డౌన్ తో రోజు రోజుకి వలస కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశ౦ లేకపోవడం తో వేలాది మంది వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్ళిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు నడిచి వెళ్తున్నారు. తినడానికి తిండి లేక నరకం చూస్తున్నారు.

తెలంగాణాలోని ఆదిలాబాద్ , మెదక్, నిజామాబాద్ జిల్లాల అడవుల నుంచి వాళ్ళు నడిచి వెళ్ళే పరిస్థితి. ఈ నేపధ్యంలో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా గిమ్మ గ్రామం ప్రజలు పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామం మొత్తం కూడా మైదా పిండి, గోధుమ పిండి, బియ్యం సేకరిస్తున్నారు. తలో కొంచెం సేకరించి వలస కార్మికుల ఆకలి తీరుస్తున్నారు. అన్నం వండి పెడుతున్నారు, రొట్టెలు చేసి పెడుతున్నారు.

రొట్టెలు వేసి వాళ్లకు స్వయంగా వండి పెడుతున్నారు గ్రామస్తులు. రైల్వే ట్రాక్ మీద నుంచి నడిచి వెళ్తున్న వాళ్లకు ఆహారం అందిస్తున్నారు. అడవుల్లో వెళ్ళే వాళ్లకు రక్షణకు ఆయుధాలు కూడా ఇస్తున్నారు. అలాగే మంచి నీళ్ళ బాటిల్స్ ఇవ్వడం, కాసేపు సేద తీరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ గ్రామం మీదుగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కార్మికులు నడిచి వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news