లాక్ డౌన్ వల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్న విషయం అందరికీ తెలిసినదే. పని లేక ఇంటికి పరిమితం కావడంతో ఆకలి కేకలు పెడుతున్న మధ్య తరగతి పేద ప్రజలకు ప్రభుత్వాలు రేషన్ మరియు మరి కొంత నగదు ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క లాక్ డౌన్ వల్ల వలస కూలీలు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలు దాటి వెళ్లిన వలస కార్మికులు పనులు లేకపోవడం తో ఉండటానికి నివాసం లేకపోవడం తో వందల కిలోమీటర్ల నడుస్తూ సొంత ఇంటికి పయనమవుతున్నారు. లాక్ డౌన్ పొడిగింపు వల్ల కాలిబాటల్లోనూ ఇంటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. వెయ్యి కిలోమీటర్లు కలిగినవారు కూడా రోడ్డెక్కి పడుతున్న కష్టాలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది మధ్యలోనే ఆహారం లేక నీరు లేక డీహైడ్రేషన్ వల్ల చనిపోతున్నారు. కొంతమంది ఇంటి దగ్గరకు చేరుకునే క్రమంలోనే తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఎండలు భయంకరంగా ఉన్న నేపథ్యంలో వలస కూలీలు లాక్ డౌన్ వాళ్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా దేశం మొత్తం పెద్ద మనసు చేసుకుని వలస కూలీలను ప్రభుత్వాలు కాపాడుకోలేక పోతే కరోనా వైరస్ కంటే వలస కూలీల మరణాలు ఎక్కువ ఉంటాయని మేధావులు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకునే ప్రభుత్వాలు. అదే విధంగా ఇతర దేశాలలో ఉన్న దేశ ప్రజలను ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకు వచ్చిన ప్రభుత్వాలు, వలస కూలీల కోసం ప్రత్యేకమైన రైళ్లు మూడు రోజులు దేశంలో నడిపించాలని అంటున్నారు.