BREAKING: తిరుపతిలోని పోలింగ్ బూత్ లో కాల్పులు కలకలం రేపాయి. చంద్రగిరి బ్రహ్మన కాలువ భూత్ 380 లో కాల్పులు కలకలం రేపాయి. టిడిపి, వైసిపి కేడర్ మధ్య ఘర్షణ నెలకొంది.. అయితే.. వారిని అదుపు చేయడం కోసం గాల్లో ఓ రౌండ్ కాల్పులు జరిపాయి కేంద్రం బలగాలు.
దీంతో చెల్లచెదురయ్యారు టిడిపి, వైసిపి కార్యకర్తలు. దీంతో చంద్రగిరి బ్రహ్మన కాలువ భూత్ 380 లో ఎప్పటి లాగే పోలింగ్ జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల మాత్రం ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల ఏకంగా పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ అవ్వడం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని అపహరించారు. వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం నుంచి ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో పాటు ఈవీఎంలు ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది.