కరోనా కట్టడికి కొత్త దారి వెతికిన అమెరికా – ఇదొక్కటే సొల్యూషన్ ?

-

అమెరికాలో కరోనా మరణ మృదంగం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. కొన్ని వేల ప్రాణాలు రోజు అమెరికాలో పోతున్నాయి. రోజురోజుకి కొత్త కేసులు మరియు మరణాలు సంభవించడం తో పరిస్థితి చాలా దారుణంగా మారింది. మరోవైపు కరోనా నీ ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది.coronavirus test kits: Pune based Mylab becomes first Indian ...పరిస్థితి ఇలానే ఉంటే అమెరికా దేశం అన్ని విధాలా నష్టపోతుందని కరోనా కట్టడికి కొత్త దారిని ప్రభుత్వానికి సూచించారు అమెరికా వైద్యులు. మేటర్ ఏమిటంటే దేశంలో కరోనా పరీక్షల సంఖ్య భారీ ఎత్తున పెంచాలని సూచిస్తున్నారు. ఇటువంటి విధానం ద్వారానే అమెరికాలో కరోనా వైరస్ నీ కట్టడి చేయ గలుగుతాము అని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కరోనా అమెరికాలో ఆల్రెడీ సామాజిక వ్యాప్తి దశలో ఉంది.

ఇటువంటి క్లిష్ట సమయం లో కొంద‌రిలో ఆ వైర‌స్ ల‌క్ష‌ణాలు ఏమీ క‌న‌ప‌డ‌వు, వారిలో వ‌చ్చిందీ-వెళ్లింది ఏమీ తెలీదు. ఇలాంటి వారు క్యారియ‌ర్స్ గా మారి చాలామంది ప్రాణాలకు డేంజర్ గా మారుతారు అని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయడమే పెద్ద సొల్యూషన్ అని అంటున్నారు. రెండు వారాల్లోగా అమెరికా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే దాదాపు కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news