కేంద్రం గుడ్ న్యూస్; ఒక్క రోజులో వెయ్యి మంది రికవరీ…!

-

కరోనాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చిన్న గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా వెయ్యి మంది కరోనా బాధితులు కోలుకున్నారు అని కేంద్రం పేర్కొంది.. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,553 మందికి కరోనా సోకింది అని, కోలుకునే వారి శాతం 27 గా ఉందని పేర్కొంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 42 వేలు దాటిందని కేంద్రం వివరించింది. ఒక రోజులో ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే ప్రధమం అని కేంద్రం పేర్కొంది.

ఇక లాక్ డౌన్ అమలు సహా కొన్ని విషయాలపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాస్తవ కీలక వ్యాఖ్యలు చేసారు. అంతరాష్ట్ర సరుకుల రవాణాకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పామని ఆమె ఈ సందర్భంగా వివరించారు. సరుకుల రవాణా సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం నంబర్ 1930,

హెల్ప్‌లైన్ నంబర్ 1033కు కాల్ చేసి డ్రైవర్స్ ఫిర్యాదు చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. లాక్‌డౌన్ అమలు సమయంలో షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, సెలూన్స్, స్పాలు తెరిచేందుకు అనుమతి లేదని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. మతపరమైన ప్రార్థన మందిరాలు కూడా మూసివేసే ఉంటాయని పేర్కొన్నారు. ఎయిర్, ట్రైన్, మెట్రో సేవలు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో అందుబాటులో ఉండవని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news