కోహ్లీకి బోర్డు వార్నింగ్…?

-

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు జట్టుకి ఎంత అవసరం అనేది అందరికి తెలిసిన విషయమే. కోహ్లీ కారణంగా జట్టు విజయాల బాటలో పయనిస్తుంది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు కోహ్లీ తీవ్ర ఒత్తిడి లో ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. టి20 కెప్టెన్ గా అతను తప్పుకోవాలని బోర్డ్ పెద్దలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కోహ్లీ ముందు కొన్ని ఆప్షన్ లు పెట్టారట.

టి20 కెప్టెన్ గా ఉండటానికి ఆసక్తి చూపిస్తే మాత్రం వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అని చెప్పారట. లేదా టెస్ట్ కెప్టెన్ గా అయినా తప్పుకోవాలని చెప్తున్నారట. జట్టు విజయావకాశాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటే మంచిది అనే సూచన కోహ్లీ కి చేస్తున్నారు. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్ గా ఉండాలి అనే కోరిక ఉంది. దానికి కోహ్లీ అడ్డం పడుతున్నాడు అనే వాదన కూడా ఉంది.

న్యూజిలాండ్ పర్యటనలో జట్టు ఓటమికి కోహ్లీ ఆట తీరు కారణం అనేది చాలా మంది చెప్పే మాట. అతను విదేశాల్లో కెప్టెన్ గా రాణించడం కష్టం అవుతుంది అని, స్వదేశంలో కెప్టెన్ గా ఉండటం వేరు విదేశాల్లో కెప్టెన్ గా ఉండటం వేరు అని, అక్కడికి వెళ్తే ఆట తీరు మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి అని, మూడు ఫార్మాట్ సీరీస్ ఆడితే అప్పుడు ఫోకస్ చేయడం చాలా కష్టం అవుతుంది అని బోర్డ్ చెప్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news