మాస్ మహారాజా రవితేజ అకౌంట్ లో మరో సినిమా …!

-

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రస్తుతం‌ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. “క్రాక్‌” అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ రాలేదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ క్రాక్ తో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు.

 

ఇక ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్ తో క్రాక్ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. జూలై లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక శృతిహాసన్ చాలా కాలం తర్వాత మళ్ళీ “క్రాక్‌” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రవితేజ తో శృతిహాసన్ బలుపు సినిమాలో నటించి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటిస్తుంది. నెగిటివ్ రోల్ లో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే సముద్ర ఖని నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు రవితేజ. ఇక తాజాగా ఈ మాస్ రాజా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ కాకపోయినప్పటికి వక్కంతం వంశీ కి మాత్రం దర్శకుడిగా మంచి పేరుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోలతో సినిమా అనుకున్నాడు వక్కంతం వంశీ. కాని ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ దర్శకుడికి మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక గతంలో రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్ లాంటి సినిమాలకి వక్కంతం వంశీ కథ అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news