కుందేళ్ళ పెంపకంలో అధిక లాభాలను పొందాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

-

తక్కువ పెట్టుబడితో కుందేళ్ల పెంపకాన్ని చెయొచ్చు.. గ్రామీణ ప్రాంతాల్లో వుండే ఎవరైనా కూడా ఈ కుందెల్లను పెంచవచ్చు..వీటి పెంపకానికి స్ధలం కూడా చాలా తక్కవగా అవసరమౌతుంది. అదనపు కూలీ ఖర్చులు ఉండవు ఒక కుటుంబంలోని సభ్యులే ఫామ్ నిర్వాహణ బాధ్యతలు చూసుకోవచ్చు. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొసం కుందేళ్లను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ లాభసాటి ప్రస్తుతం లాభసాటి ఉంది. కుందేళ్ల వెంట్రుకలతో తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నారు. దీని మాంసంలో అధిక పోషకవిలువలు కలిగి ఉండటంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..


కుందేళ్లను రెండు రకాల కుందేళ్ల ను పెంచుతారు. ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అంటారు. మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్‌ కుందేళ్లు అంటారు. చలి ప్రాంతాలు అయిన జమ్ము కాశ్మీర్‌ మరియు సిక్కిం తదితర ప్రాంతంలో అంగొరా కుందేళ్లను పెంచుతున్నారు. అంగోరా జాతిలో విభిన్న రకాలు ఉన్నాయి. బ్రిటీష్‌ అంగోరా, జెర్మన్‌ అంగోరా, రష్యన్‌ అంగోరా మొదలగునవి.న్యూజిలాండ్‌ వైట్‌, సోవియట్‌ చించిల్లా, ఫ్లెమిష్‌ జైంట్‌, గ్రేజైంట్‌ మరియు కాలిఫోర్నియన్‌ వైట్‌ జాతికి చెందిన కుందేళ్లు మన వాతావరణంలో పెంచుకోవడానికి సులువుగా ఉంటాయి.

ఇకపోతే పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్‌, బర్సీమ్‌ తప్పకుండా ఇవ్వవలెను. రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి ఇచ్చినచో మేతపై అగు ఖర్చు తగ్గుతుంది. అవి ఆరోగ్యంగా ఎదగాలి అంటే పుష్టికరమైన పచ్చి మేత పెట్టవలెను. ప్రతి కుందేలుకు సుమారు 1 లీటరు త్రాగు నీటిని 200-300 గ్రా. దాణా, 200 గ్రా. పచ్చిమేత అవసరము. కుందేళ్లకు ఇచ్చే దాణాలో పలు పోషక పదార్థాలుండాలి. మాంసకృత్తులు 15-17 శాతం ఉండునట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి..

కుందేళ్ల మాంసంలో 22 శాతం వరకు మాంసకృత్తులు ఉండడం మరియు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు ఈ మాంసాన్ని స్వీకరించవచ్చు. కుందేళ్ల పేడలో అధిక పాళ్లలో నత్రజని, భాస్వరం ఉండటం వల్ల పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా వాడవచ్చును. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం, పొటాషియం లు అధిక శాతం లో వుంటాయి..అందుకే వీటిని ఎక్కువగా తింటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news