కాసులు కురిపించే పంట.. బంజరు భూమిలో కూడా సాగు చేయొచ్చు

-

గత కొన్ని ఏళ్లుగా యువత వ్యవసాయంపై దృష్టిపెడుతున్నారు. ఉద్యోగంలో అసంతృప్తి, చాలీ చాలనీ జీతం, పైగా ఒకరికింద బానిసలా పనిచేసే ధోరణి ఇవన్నీ నేడు యువతను ఉద్యోగం వదిలేసి వ్యవసాయంపై అడుగులు వేసేసా చేస్తున్నాయి. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఆ ప్రాసెస్‌ వేరుగా ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో కాకుండా.. అగ్రికల్చర్‌కు కాస్త టెక్నాలజీ, సైన్స్‌ను జోడించి అద్భుతాలు చేయోచ్చు. నష్టం మాటే లేకుండా మంచి లాభాలు పొందేలా నేడు చాలా మంది సొంతంగా వ్యవసాయాన్ని వ్యాపారంగా మలుచుకుని దూసుకెళ్తున్నారు. వెదురు సాగుతో కూడా లక్షలు సంపాదించవచ్చు. ఈ సాగులో బాగా కలిసొచ్చే అంశం ఏమిటంటే వెదురు మొక్కలు బంజరు భూమిలో కూడా పండించవచ్చు. దీనికి ప్రభుత్వం సగానికి సగం సబ్సిడీ అందజేస్తోంది. వ్యవసాయం ద్వారా బాగా సంపాదించాలనుకుంటే వెదురు సాగు వ్యవసాయం మంచి లాభసాటిది.

బంజరు భూమిలో కూడా వెదురు పెరుగుతుంది..!

వెదురు సాగులో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ వెదురు బొంగు చెట్లను బంజరు భూమిలో కూడా పండించవచ్చు. అలాగే ఈ వ్యవసాయం చేయాలంటే నీరు కూడా తక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది. ఒకసారి నాటిన, వెదురు మొక్క నుండి ఉత్పత్తి 50 సంవత్సరాల వరకు పడుతుంది. వెదురు పెంపకానికి ఎక్కువ కూలీలు అవసరం ఉండదు. అందుకే వెదురు వ్యవసాయం రైతులలో బాగా ప్రాచుర్యం పొందింది.

ఎలా పెంచాలి..?

వెదురును ఎక్కడైనా ఎలాంటి భూమిలో అయినా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో తూర్పు భాగంలో వెదురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఒక హెక్టారు భూమిలో 1500 వెదురు మొక్కలు నాటవచ్చు. దాని మెరుగైన పెరుగుదల కోసం ఒక మొక్క నుండి మరొక మొక్కకు 2.5 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. వరుస నుంచి వరుసకు 3 మీటర్ల దూరం ఉండాలి.

వెదురులో రకాలు..

బాంబూసా ఒరాండినేసియే
బాంబుసా పాలిమార్ఫా
కిమోనోబాంబుసా ఫాల్కాటా
డెండ్రోకాలమస్ స్ట్రిక్స్
డెండ్రోకాలమస్ హామిల్టోని
మెలోకానా బెకిఫెరా వెదురు బాగా ప్రజాదరణ పొందిన జాతులు. ఈ జాతికి చెందిన వాటిలో ఏదో ఒకటి వేయవచ్చు.

ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ

వెదురు సాగుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి మీరు నేషనల్ బాంబూ మిషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ nbm.nic.inని సందర్శించడం ద్వారా సబ్సిడీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు జాతీయ వెదురు మిషన్‌ కింద ప్రతి జిల్లాలో నోడల్‌ అధికారిని నియమించారు. మీరు మీ నోడల్ అధికారి నుండి పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా పొందవచ్చు.

వెదురు మొదటి కోత మొక్క నాటిన 4ఏళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది. సరాసరి ఒక హెక్టారు భూమి 4 సంవత్సరాలలో వెదురు సాగు ద్వారా రూ.40 లక్షల వరకు సంపాదించవచ్చు. దీంతో పాటుగా వెదురు వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఇతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. సొంత భూమి ఉంటే కచ్చితంగా ఈ సాగు కాసులు కురిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news