సినిమాల్లో రైతుల మీద సింపతీ చూపిస్తూ బాగానే తీస్తారు.. అయితే అది బయట పెద్దగా వర్కౌట్ కాదు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కాస్త్ డిఫ్రెంట్.. నిజానికి వీళ్లు చేస్తున్నదంతా సినిమా తీయొచ్చు. ఆకలితో అలమటిస్తున్న పేదలకోసం.. రూ. కోటి పెట్టి పొలాలు కొని వాళ్లే వ్యవసాయం చేస్తూ.. 600 కుటంబాల కడుపు నింపుతున్నారు. ఫ్రెండ్స్ అంటే వీళ్లురా అనిపించేలా ఉన్నారు. ఈ స్టోరీ పై మీరు ఓ లుక్కేయండి..!
గతేడాది జరిగిన ఘటనలు తలుచుకుంటే.. అందరి కళ్లంతా అలా నీళ్లు తిరిగుతాయ్ కదా..! చీకటి రోజులు అనే చెప్పాలి. ఉద్యోగం పోయినవాళ్లు ఎందరో, అయినవాళ్లను పోగొట్టుకున్న వాళ్లు మరెంతో మంది ఉన్నారు. డబ్బులు లేక.. ఆకలితో అలమటిస్తూ.. ఎవరైనా కాస్త అన్నం పెడితే బాగుండూ అని ఎంతోమంది విలవిలలాడిపోయారు. అలాంటి వారిని చూసి..యూకేకు చెందిన కొందరు స్నేహితులు వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకున్నారు. అందరిలా నాలుగు ఆహార పొట్లాలు ఇచ్చేయండోతనే వారి పని అయిందని అనుకోలేదు.. దేవుడు మనిషి రూపంలో వస్తే వీళ్లేనా అన్నట్లు అనిపించింది.. ఇది మీకు కాస్త అతిశయోక్తి అనిపించవచ్చు కానీ.. వారు ఏం చేశారో మీరే చూడండి..!
తెలుగులో విడుదలైన ‘శ్రీకారం’ సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా.. వ్యవసాయానికి టెక్నాలజీ జోడించి పంటలు పండించారు. వీరికి అలాగే కత్తిలాంటి బిజినెస్ ఐడియా వచ్చింది. ‘మిడిల్ గ్రౌండ్ గ్రోవర్స్’ పేరుతో స్నేహితులంతా కలిసి ‘వెజ్ బాక్స్’ బిజినెస్ ప్రారంభించారు. క్రౌడ్‌ఫండింగ్ ద్వారా రూ.కోటి వరకు విరాళాలు సేకరించారు. ఆ మొత్తంతో 16 ఎకరాల పొలాలను కొనుగోలు చేశారు. అక్కడ ఆర్గానిక్ కూరగాయలను పండించారు.
లాక్‌డౌన్ సమయంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల స్థానికంగా చాలామంది పేదలకు ఉపాధి దొరికింది. అంతేగాక, ప్రజల నుంచి కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్లు లభించేవి. ఫలితంగా.. వారి సంస్థకు ఆదాయమే కాకుండా 600 కుటుంబాల ఆకలి తీర్చడంలో సక్సెస్ అయ్యారు. అంతే, ఆ సంస్థ పేరు దేశమంతా మారుమోగింది.
సేవింగ్స్ తో పొలాలు కొనుగోలు..
హమిష్ ఎవాన్స్ జేవియర్ హమోన్, లివి రోడ్స్, సామీ ఎల్మోర్ అనే ముగ్గురు స్నేహితులు ఈ వెజ్ బాక్స్ బిజినెస్ మొదలుపెట్టారు. తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు 2020లో కొన్ని స్థలాలను అద్దెకు తీసుకుని కూరగాయలు పండించారు. అయితే, వచ్చే ఆదాయమంతా అద్దెలకు సరిపోతుందనే కారణంతో తమ వద్ద ఉన్న డబ్బుతో పొలాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు ఆ పొలాలు కొనేందుకు సుమారు రూ.2 కోట్లు అవసరమయ్యాయి. దీంతో వారు బ్యాంక్‌లో సేవ్ చేసుకున్న రూ.కోటి నగదును ఇందుకు ఖర్చుపెట్టారు. క్రౌడ్‌ఫండింగ్ ద్వారా వచ్చిన మరో రూ.కోటిని కలిపి ఆ పొలాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారు వేరే ఏ ఉద్యోగం చేయడం లేదు. ‘వెజ్ బాక్స్’ బిజినెస్‌నే తమకు ఉపాధిగా చేసుకున్నారు..
వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు సంస్థలో నియమించుకున్నారు. కేవలం కాయగూరలే కాకుండా.. రకరకాల పండ్లను కూడా పండిస్తూ జనాలకు అందిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా చుట్టుపక్కల ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించి ఆకలి తీర్చడమే కాదు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా చేయాలనేది ఈ స్నేహితుల లక్ష్యం. వ్యవసాయాన్ని పండగలా చేస్తున్న వీరు ఎంతోమందికి ఆదర్శం..ఈరోజుల్లో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు కదా..!