ఈ మొక్కలని పెంచితే రైతులకి లాభాలే.. పెద్ద పెద్ద కంపెనీలూ మీ వద్దకే వస్తాయి..!

-

రైతులు పంటల విషయంలో కాస్త తెలివిగా అనుసరిస్తే చక్కగా లాభాలను పొందవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ పంటలకు డిమాండ్ బాగా పెరిగింది. నిజానికి ఈ పంటల విషయంలో రైతులు శ్రద్ధ పెడితే కష్టాలన్నీ కూడా గట్టెక్కి పోతాయి. కొన్ని కొన్ని సార్లు రైతులు కేవలం కూరగాయల పంటలు, సాధారణ పంటలు వేసి గిట్టుబాటు ధర కూడా రాకుండా నష్టపోతున్నారు. కొందరు రైతులు అయితే కష్టాలలో మునిగి ఆత్మహత్యే దారి అనుకుంటున్నారు. అయితే నిజానికి రైతులు ఎప్పుడూ కూడా తెలివిగా పండిస్తే నష్టపోరు.

ఔషధ మొక్కల్ని పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు కూడా రైతుల వద్దకు వస్తారు. ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి దీంతో ప్రజలంతా కూడా మందుల మీద ఆధారపడి ఉన్నారు. ఇంగ్లీష్ మందులు ఎలానో వాడుతూ ఉంటారు కానీ ఆయుర్వేద మందులు అలోపతి మందులు కూడా డిమాండ్ ఈ మధ్య ఎక్కువగానే ఉంటోంది. కాబట్టి వీటికి తగ్గ పంటలు పండిస్తే ఆదాయం బాగా వస్తుంది.

పైగా మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి పంటలు పండించి రైతులు లక్షల్లో ఆదాయం పొందొచ్చు అని దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీనికోసం పూర్తిగా చూసేయండి. మీకు పొలం ఉండి.. మంచిగా బిజినెస్ చేయాలని అనుకుంటే ఔషధ మొక్కలు పెంచొచ్చు. పైగా పెట్టుబడి కూడా భారీగా అవసరం లేదు. అదే విధంగా ఎకరాల ఎకరాల స్థలం కూడా అక్కర్లేదు. కొద్దిపాటి స్థలం తక్కువ పెట్టుబడి ఉంటే చాలు.

చాలా మంది రైతులు తెలివిగా ఔషధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఔషధ మొక్కల్ని పండించి వాళ్ళకి అమ్ముతున్నారు. మీరు కూడా ఇలా అమ్మితే మీ వద్దకే కంపెనీలు వస్తాయి. ఔషధాల మార్కెట్ చాలా పెద్దది. అందులో ఉపయోగించే సహజ ఉత్పత్తులకు డిమాండ్ ఎప్పుడూ భారీగానే ఉంటుంది.

పైగా అన్ని కాలాల్లోనూ కూడా ప్రజలకు ఇవి అవసరం. కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు. ఆదాయం లక్షల్లో ఉంటుంది. అయితే మరి ఎటువంటి ఔషధ మొక్కల్ని పండించవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

తీవ్రమైన వ్యాధులకు చెక్ పెట్టే తులసి:

తులసి మనం పూజిస్తూ ఉంటాము అలానే ఔషధాల్లో కూడా తులసిని వాడతారు. తులసి మొక్కల వల్ల చాలా లాభాలు ఉంటాయి ఆయుర్వేద వైద్యంలో కూడా దీనిని విరివిగా వాడుతూ ఉంటారు. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా తులసితో చెక్ పెట్టొచ్చు.

తులసి కి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. ఒక హెక్టారు లో తులసి పండించడానికి పదిహేను వేలు మాత్రమే ఖర్చు అవుతుంది మూడు నెలలు మీరు పండిస్తే మూడు లక్షల రూపాయలకు అమ్మొచ్చు. పైగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా తులసి కోసం క్యూ కడుతున్నాయి. ఇలా మీరు తులసిని పండించి అద్భుతంగా రాబడి పొందొచ్చు.

ఎన్నో ప్రొడక్టులకు అవసరమయ్యే అలోవెరా:

కలబంద తో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలోవెరా జెల్, అలోవెరా జ్యూస్, అలోవెరా క్రీమ్ ఇలా చాలా ఉన్నాయి. హ్యాండ్ వాష్ లు, షాంపూలు, సబ్బులు, శానిటైజెర్లు, బాడీ లోషన్లు, బాడీ వాష్ లు ఇలా ఎన్నో వాటిల్లో అలోవెరా ని వాడుతున్నారు.

నిజానికి అలోవెరా కి కూడా బాగా డిమాండ్ ఉంది. మీరు కలబంద ని కూడా పండించి మంచిగా సంపాదించుకోవచ్చు. పతంజలి, డాబర్, బైద్యనాథ్ వంటి కంపెనీలకు మీరు కలబందని అమ్మచ్చు. దీని వల్ల కూడా రైతులకి మంచిగా డబ్బులు వస్తాయి.

సమస్యలను తొలగించే బ్రహ్మి, శతావరి, అశ్వగంధ, తిప్పతీగ, అశోక:

అదే విధంగా బ్రహ్మి, శతావరి, అశ్వగంధ, తిప్పతీగ, అశోక వంటి వాటిని కూడా పండించవచ్చు, వీటికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. మీకు సరిపడే భూమి ఉండి పండించాలని అనుకుంటే హెర్బల్ మార్కెటింగ్ మీద అవగాహన పెంచుకుని చక్కగా సంపాదించుకోండి. దీనితో పెట్టుబడి వేలల్లో ఆదాయం లక్షల్లో.

Read more RELATED
Recommended to you

Latest news