ఇలా హెర్బల్ మిక్సర్ ని పశువులకు ఇస్తే ఆరోగ్యంగా ఉంటాయి..!

-

పాడి పరిశ్రమ రైతులకి మంచిగా ఆదాయాలని తీసుకు వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని ఇదే రెట్టింపు చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో పాడి పశువులకు వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. పశువుల పెంపకం విషయంలో, ఆరోగ్యం విషయంలోనూ అధిక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. వాటి యొక్క ఆరోగ్యం పై ఎలాంటి నిర్లక్ష్యం చెయ్యడం మంచిది కాదు.

ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే పశువుల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన కొన్ని రకాల దినుసులను ఉపయోగించి హెర్బల్ మిక్స్ ని తయారు చేస్తే పశువులకు మంచిది.

ఇది వాటి యొక్క ఆరోగ్యాన్ని బాగా ఉండేలా చూస్తుంది. సకల పోషక విలువలు ఔషధ గుణాలు కలిగిన హెర్బల్‌ మిక్చర్‌ను తయారుచేసి వాటికి ఆహారంగా ఇస్తే పశువుల్లో జీర్ణశక్తి మెరుగుపడి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు హెర్బల్ మిక్సర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

దీని కోసం మనకి ఉలవలు 1.5 కిలోలు,తాటి బెల్లం1.5 కిలోలు,యాలకులు 50 గ్రా, లవంగాలు100 గ్రా, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పళ్లు 50 గ్రా, సొంఠి 200 గ్రా, మిరియాలు 150 గ్రా, వాము 200 గ్రా, దాల్చిన చెక్క50 గ్రా,నల్ల నువ్వులు లేదా వేరు పిసరాకు 1.5 గ్రా, పాల ఇంగువ100 గ్రా, వెల్లుల్లి 300 గ్రా, మెంతులు 150 గ్రా ,మోదుగుపువ్వు 300 గ్రా తీసుకోవాలి.

వీటి అన్నింటినీ దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఆవ నూనె ఒక లీటరు వరకు కలపచ్చు. దీనిని నెలలో 15 రోజులు వాడితే సరిపోతుంది. పాలిచ్చే పశువులకు రోజుకు 50 గ్రాముల హెర్బల్ మిక్సర్ ఇవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news