కంది పంట వెయ్యడానికి అనువైన పరిస్థితులు..సాగు పద్ధతులు..

-

మన రాష్ట్రాలలో కంది పంట వానిజ్య పంట..అందుకే ఈ పంట సాగు కీలకమైనది.ప్రతి ఏటా మన రాష్ట్రంలో 11.25 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 2.02 లక్షల టన్నుల ఉత్పత్తి నిస్తుంది. ఎకరాకు 180 కిలోల దిగుబడిని ఇస్తుంది.ఇకపోతే పత్తి, మిరప,పొగాకు, పెసరమినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్‌లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరిపంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తుంటారు. కందిని రబీలో కూడా పండిస్తారు.

ఇప్పుడు కంది సాగుకు అనుకూల పరిస్థితులు..

వరి రకాల తర్వాత కూడా కందికి అవకాశముంది. అయితే అక్టోబర్‌ తర్వాత కంది విత్తకూడదు.తొలకరి కంది ఎక్కువ ఎత్తు పెరగటం వలన ఈ పంటను ఆశించే కాయ తొలుచు పురుగు మరియు మరుకా మచ్చల పురుగుల నివారణ కష్టమౌతుంది. రబీ కంది, అనువైన ఎత్తులో వుండటం వలన సస్యరక్షణ చర్యలు చేపట్టటం తేలిక. రబీ కంది జనవరిలో పూతకొస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది.దాని వల్ల పురుగులను తట్టుకుంటుంది..

మన రాష్ట్రంలో పంటకు అనువైన నేలలు..

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కోస్తా ప్రాంతాలలో పండిస్తారు.కందిని వర్షాధార పంటగా సాగుచేయవచ్చు. ఈ జిల్లాలే కాకుండా గోదావరి నది వరద తాకిడికి గురయ్యే వరంగల్‌ మరియు ఖమ్మం జిల్లాల్లో వరద పోయిన తర్వాత రబీ కంది సాగుకు అనుకూలం. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ మరియు నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కందిని ఆరుతడి పంటగా పండించవచ్చు..నీళ్ళు మంచిగా వుంటే ఎటువంటి నేలలో అయిన ఈ పంటను సాగు చేయవచ్చు.

అనుకూల పరిస్థితులు..

వర్షా భావం ఎక్కువగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలను తీసుకోవాలి..ఇకపోతే తేమ మరియు తేమతో కూడిన పరిస్థితులు ఏపుగా పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. మొదటి 8-10 వారాలు తేమతో కూడిన పరిస్థితులతో 60-100 సెం.మీ సగటు వార్షిక వర్షపాతం మరియు పుష్పించే మరియు కాయ-అభివృద్ధి దశలో ఉన్న పొడి పరిస్థితులు అత్యంత విజయవంతమైన పంటకు దారితీస్తాయి. ఏది ఏమైనప్పటికీ, పుష్పించే సమయంలో వర్షాలు కురిస్తే పరాగసంపర్కం మరియు కాయల అభివృద్ధి సరిగా జరగదు మరియు దీని ఫలితంగా పాడ్-బొరేర్ సోకుతుంది. 18-27 ° C ఉష్ణోగ్రత పరిధి కావాల్సినది.10- 35 డిగ్రిల ఉష్ణోగ్రతలు వున్నా ఈ పంట పండుతుంది.ఇందుకు కావాల్సిన రకాలను ఎంచుకొవాలి.

Read more RELATED
Recommended to you

Latest news