నాటు కోడి గుడ్ల ఉత్పత్తిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..!

-

నాటు కోడి గుడ్ల కి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది రైతులు, నిరుద్యోగ, యువత, మహిళలు కూడా నాటు కోళ్ల పెంపకం మొదలుపెట్టి నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.

నాటు కోడి గుడ్డు పది రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకనే ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేయాలంటే కొన్ని మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది.

సాధారణంగా కోళ్ళని పెంచాలంటే షెడ్డు కంటే కూడా బాగా బయట తిరిగే ప్రదేశం లోనే ఉంచాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. పైగా నాటు కోళ్లు గుడ్లు పెట్టడానికి చీకటిగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. కాబట్టి వాటికి ప్రత్యేకమైన షెడ్డు ఏర్పాటు చేయాలి. పాత టైర్లను ఒక దానిపై ఒకటి పేర్చి గుడ్లు పెట్టడానికి అనువుగా ఏర్పాటు చేస్తే అప్పుడు అవి అక్కడికి వెళ్లి గుడ్లు పెడతాయి.

పైగా రబ్బరు టైర్ వల్ల గుడ్డు పగలదు. నాటు కోళ్లు గుడ్లు పెంచుతున్నప్పుడు ఎనిమిది పెట్ట కోళ్లకు ఒక పుంజు ఉండేటట్టు చూసుకోవాలి. పెట్ట ఐదు నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఇలా ఏడాదికి ఒక్క పెట్ట కోడి నాలుగైదు సార్లు గుడ్లు పెడుతుంది. ఇంకుబేటర్ ఏర్పాటు చేస్తే గుడ్లు పొదిగే సమయం ఆదా అవుతుంది ఇలా నాటు కోళ్ల గుడ్ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఫలితాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news